ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:678

GOLCONDA NEWS | Updated:2024-01-09 15:45:50 IST

ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్

- కంప్యూటరీకరణ పేరుతో కాలయాపన చేస్తారా..?
- 6 గ్యారంటీలు అమలు చేయకుండా డ్రామాలెందుకు?
- రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బండి సంజయ్ కుమార్
- సర్కారు స్కూళ్లలో టాయిలెట్లను టీచర్లే కడిగే దుస్థితి
- మాల్దీవ్స్ కు భారత్ సత్తాను చాటిన ప్రజలకు హ్యాట్సాఫ్
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే…వచ్చే మార్చి, ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని... అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముందన్నారు. ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమంటే డ్రామాలాడటమే అని పేర్కొన్నారు.
వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామానికి వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ... తాము నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నామని, గత ప్రభుత్వం మాదిరిగా అహంకార పూరితంగా వ్యవహరిస్తూ ప్రతి విమర్శలు చేస్తే బీఆర్ఎస్ నేతలకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నాని అన్నారు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో స్కావెంజర్లు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రస్తావించగా సంజయ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని మొత్తుకున్నా గత ప్రభుత్వం నుండి స్పందన లేదని... ఇయాళ ఉపాధ్యాయులే స్కూళ్లలో టాయిలెట్లు కడిగే దుస్థితి కన్పిస్తోందన్నారు. చాలా పాఠశాలల్లో సరైన టాయిలెట్స్ లేక అపరిశభ్రతకు నిలయాలుగా మారాయన్నారు. వెంటనే రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలో స్కావెంజర్లను నియమించాలన్నారు.
మాల్దివుల అంశాన్ని ప్రస్తావిస్తూ… భారత్ ను, ప్రధాని మోదీగారిని దూషిస్తే… ఫలితాలు ఎట్లుంటాయో మాల్దివుల ప్రభుత్వానికి రుచి చూపించిన భారతీయులకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని…. భారత్ లో పర్యాటక ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేసేందుకు ప్రధాని మోదీ లక్ష్యద్వీప్ కు వెళితే.. మాల్దివులకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రపంచం సిగ్గుపడేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. ఫలితంగా మాల్దీవుల్లోని 8,500 హోటల్లో చేసుకున్న బుకింగులు, 2,500 మంది విమాన టిక్కెట్లను భారతీయులు రద్దు చేసుకున్నారని వివరించారు. జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన ఆ దేశ ప్రభుత్వం ఆ ముగ్గురు మంత్రులను తొలగించి… వారి వ్యాఖ్యలు వ్యక్తిగతమని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
తెలంగాణ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
Updated:2024-02-16
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
Updated:2024-02-06
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం
Updated:2024-01-29
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
Updated:2024-01-05
కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు
Recent గా మీరు చదివినవి
Last visit:2024-12-22 23:58:39 IST
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్ share
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498