హైదరాబాద్‌కు కవిత.. 500 కార్లతో భారీ ర్యాలీ చేపట్టనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కాం కేసులో బెయిల్ రావడంతో ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా 500 కార్లతో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆమె నివాసం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీలో భాగంగా తన తండ్రి కేసీఆర్‌తో కవిత భేటీ అవుతారు. ఆ తర్వాత తిరిగి ఆమె నివాసానికి చేరుకుంటారు. కాగా ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటలకు ఢిల్లీ నుంచి ఆమె హైదరాబాద్‌కు బయల్దేరుతారు.