తెలంగాణ రాష్ట్రంలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ 2023 కు గాను దేశంలోని టాప్ మూడు పోలీస్ స్టేషన్లలో ఒక బెస్ట్ పోలీస్ స్టేషన్ గా ఎంపికైంది. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బీ. నాగేంద్రబాబు ను రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ప్రత్యేకంగా అభినందించారు. సైబరాబాద్ పరిధిలోని పోలీసు అధికారులు పాల్గొన్నారు. స్టేషన్ పరిధిలో ఉన్న సిబ్బంది.. అధికారుల సహకరంతోనే ఈ విజయాన్ని సాధించినట్లు నాగేంద్రబాబు తెలిపారు. ఇదే అంకితభావంతో పని చేస్తే భవిష్యత్ లో మరెన్నో విజయాలు సాధించే అవకాశాలున్నయి.