ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:806

GOLCONDA NEWS | Updated:2024-01-09 05:48:40 IST

బిల్ట్ పై చిగురిస్తున్న ఆశలు

-పునరుద్దరించేందుకు సీఎం చొరవ
- ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష
ములుగు జిల్లా కమలాపురంలో బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (BILT) కంపెనీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కంపెనీని పునరుద్దరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారవుతుంది. 2014 లోనే ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరికీ ఉపాధి కల్పించటంతో పాటు స్థానికంగా ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబున్యల్ తీర్పు ప్రకారం ప్రస్తుతం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినంలో ఉన్నాయి. ఆ కంపెని ఎండీ హార్దిక్ పటేల్‌, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈఓ వాదిరాజ్ కులకర్ణితో పాటు సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి డా. బి. ఆర్. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమావేశమయ్యారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ఆలోచనను వారితో పంచుకున్నారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను చర్చించారు.
మిల్లును తెరిపించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్‌క్వెస్ట్ బృందాన్ని కోరారు. బిల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఐటీసీ కంపెని ఆసక్తి చూపుతోంది. ఫిన్ క్వెస్ట్ కంపెనీ ఐటీసీతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కోరారు. బిల్ట్ మిల్లును పునరుద్ధరించే ప్రక్రియలో ఐటీసీకి అన్ని విధాలా ప్రభుత్వ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. గత ప్రభుత్వం 2015, 2018లో ప్రోత్సాహకాలను పొడిగించి, మూతపడ్డ ఈ యూనిట్‌ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
సీఎంతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ములుగు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-29
అయోధ్యలో విమానాశ్రయం ప్రారంభోత్సవం రేపే        |       187 Reading
Updated:2023-12-30
అస్సాంలో ఇక శాంతి..... : ప్రధాని నరేంద్ర మోది        |       474 Reading
Updated:2023-12-25
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి...        |       320 Reading
Updated:2023-12-30
80 కొత్త బస్సులు ప్రారంభం        |       115 Reading
Updated:2023-12-22
జాగ్రత్త లేకుంటే అంతే సంగతి..        |       129 Reading
Updated:2024-01-05
కామన్ మ్యాన్.. ఈ మినిస్టర్        |       100 Reading
Updated:2023-12-26
ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు        |       150 Reading
Updated:2023-12-26
లఢఖ్ లో భూకంపం        |       463 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498