సీఎంగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి వినూత్న విధానాలతో వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనదైన ప్రత్యేకమైన ముద్రను అన్ని రంగాల్లో వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఇవ్వరనే ప్రచారాన్ని బీఆర్ ఎస్ నేతలు చేసిన లో క్లాస్ ప్రచారాలకు ఎటువంటి రియాక్షన్లు ఇవ్వకుండానే తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. యాదాద్రి ప్రాజెక్టు కు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ చేయాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విసిరిన సవాల్ ను సీఎం స్వీకరించారు. ఈ ప్రాజెక్టుపై న్యాయవిచారణకు ఆదేశించారు.