కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. బుద్వేల్ , రాజేంద్రనగర్ లలో నిర్మించబోయే కొత్త హైకోర్టు కోసం 100 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవో కాపీలు విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనాల సముదాయం ఇరుకుగా ఉండటం.. సిటీలో లోపల ఉండటంతో అన్ని విధాలుగా సరిగా ఉండటం లేదనే చర్చ వచ్చింది. దీంతో విశాలమైన ప్రాంగణంలో కొత్తది నిర్మాణం చేపట్టాలని నూతన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వెంటనే అమల్లోకి తెచ్చారు. భూమి కేటాయింపులు పూర్తి అవడంతోనే పనులు కూడా త్వరలోనే మొదలుకానున్నాయి.