ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:595

GOLCONDA NEWS | Updated:2024-01-08 11:23:42 IST

ఇరిగేషన్ ఆఫీస్ లో కంప్యూటర్లు మాయం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎండీ కాలనీలోని ఇరిగేషన్ ఆఫీస్ లో ఆదివారం దొంగలు పడ్డరు. ఆఫీసు తాళాలు పగలగొట్టి 5 కంప్యూటర్లు(సీపీయూ, మానిటర్లు) లతో సహా ఎత్తుకెళ్లారు. వైఫై కనెక్టింగ్ డాటా, వివిధ సామాగ్రిని దొంగలించారు. సుమారు రూ. 2.5 లక్షల విలువ గల సామాగ్రి చోరీకి గురైంది. ఆఫీస్ సూపరింటెండ్ అంజిరెడ్డికి వాచ్ మెన్ సమాచారం అందించడంతో వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ ఐ చేరాలు ఘటనాస్థలికి చేరుకుని అక్కడ ఉన్న అధికారులను సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అని ఆరా తీశారు.. కానీ అవి కొంతకాలంగా పనిచేయకపోవడం లేదనే విషయం తేలింది. దొంగతనానికి గురైన కంప్యూటర్లలో ప్రాజెక్టు కు సంబంధించిన డాటా తో పాటు క్యాంపు క్వార్టర్లు , అటెండర్లు వివిధ డెవలప్మెంట్ కు సంబంధించిన డాటా పోయింది. బీరువా ను పగలగొట్టి వివిధ ఫైళ్లను కూడా ఎత్తుకెళ్లినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. క్లూస్ టీం సోమవారం వేలిముద్రలు సేకరిస్తున్నారు.
గవర్నమెంట్ ఆఫీస్ లకు కూడా సెక్యూరిటీ లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం అక్కడే ఉంటుంది. అయినా ఏ మాత్రం భద్రతా చర్యలు తీసుకోలేదు. ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఉన్నా.. అవి గత కొంతకాలంగా పనిచేయడం లేదని అధికారులు చెప్పడం విస్మయానికి గురి చేస్తుంది. బీఆర్ ఎస్ ప్రభుత్వం పోయి... కాంగ్రెస్ ప్రభుత్వం మారిన తరవాత హైదరాబాద్ లోని పలు ఆఫీసుల్లో కాగితాలు మాయం చేసిన సంగతి తెలిసిందే. పశు సంవర్ధక శాఖ, పర్యాటక శాఖ లాంటి వాటిల్లో ఏకంగా ఫైళ్లనే కాల్చి వేశారు. ఈ ఆఫీస్ లో కూడా ప్రాజెక్టులకు సంబంధించిన కీలక సమాచారం ఉంటుంది. అందుకే అధికారులు.. సిబ్బంది కలిసి అక్రమాలు బయటకు రాకుడదనే ప్లాన్ ప్రకారమే కంప్యూటర్లను మాయం చేశారా అనే అనుమానాలను తావిస్తుంది. కాలేశ్వరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్దమవుతున్న తరుణంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. పోలీసులు ఇప్పటికే అందరి అధికారుల ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు. వీళ్లంతా నిన్నటి రోజున ఏయే లోకెషన్లలో ఉన్నారనే కూపీ లాగుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోతే కనీసం వాటిని బాగు చేయించుకునే టైమ్ లేదా అంటూ అధికారులు విరుచుకుపడుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
క్రైమ్ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-23
రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే దుర్మరణం
Updated:2024-02-10
అక్కడ భూమే లేదు.. కోటికి పైగా వసూలు చేసిండ్రు
Updated:2024-02-06
గంగుల అనుచరుడు శ్రీపతి అరెస్టు
Updated:2024-02-02
భూకబ్జాలకు పాల్పడిన మాజీ ఎంపీటీసీ అరెస్టు
Updated:2024-01-31
బ్రాండ్ రైస్ పేరిట మోసాలు
Updated:2024-01-24
కటకటాల్లోకి కబ్జాకోరులు
Updated:2024-01-10
పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ : 6గురికి గాయాలు
Updated:2024-01-05
జాతీయ స్థాయిలో పోలీస్ స్టేషన్ కు గుర్తింపు
Updated:2024-01-04
యువతి పై కత్తితో దాడి: ప్రేమ వ్యవహారమే కారణమా..?
Updated:2023-12-30
రోడ్డు ప్రమాదంలో 5 గురి దుర్మరణం
Updated:2023-12-30
ట్రావెల్ బస్ బోల్తా: ఇద్దరు మ్రుతి, 55 మందికి గాయాలు
Updated:2023-12-26
మాజీ ప్రియుడిపై ప్రియురాలు కుట్ర
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498