ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందాలంటే వారందరికి రేషన్ కార్డు ఉండి తీరాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి , మంత్రివర్గ సభ్యుల చేతులమీదుగా బుధవారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజా పాలన దరఖాస్తులను ఆవిష్కరించారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ప్రజా పాలన దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తుందని సీఎం వెల్లడించారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ లను సీఎం తీసుకున్నారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే నిరుద్యోగులకు కూడా ఇదే మీటింగ్ లో క్లారిటీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన తరవాతే పరీక్షలు ఉంటాయని.. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందకూడదని సీఎం స్పష్టం చేశారు.