ప్రముఖ జర్నలిస్టు బొల్గం శ్రీనివాస్ సీఎం పీఆర్వోగా నియామకం అయ్యారు. చేస్తున్న పనిలో నిబద్దత.. క్రమశిక్షణ.. అంకితభావమే పల్లె నుంచి పట్నం వరకు తీసుకెళ్లింది. గ్రామీణ జర్నలిస్టు నుంచి సీఎం పీఆర్వో వరకు అంచెలంచెలుగా ఎదిగారు. బొల్గం శ్రీనివాస్ పుట్టింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణ పూర్ గ్రామం. పల్లెలో పుట్టి.. గ్రామీణ జర్నలిస్టుగా ఈనాడుతో తన జర్నలిజాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా పైకి ఎదిగారు. గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నపుడే ఈనాడు జర్నలిజం స్కూల్ కు సెలక్ట్ అయి.. అక్కడి నుంచి సూర్యాపేట, అనంతపురం, ఖమ్మం జిల్లాల్లో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశారు. ఆ తరవాత సాక్షి లాంచింగ్ టైమ్ లో అందులో చేరి కరీంనగర్, వరంగల్ జిల్లా బ్యూరోగా పని చేశారు. అటు నుంచి హైదరాబాద్ లో స్టేట్ బ్యూరోలో పనిచేశారు. ఎన్నో ఇన్వెస్టిగేషన్ వార్తలతో పాటు జనాలను చదివించే ఆసక్తికర వార్తలను ఎన్నో అందించారు.
సాక్షిలో పని చేస్తున్న కాలంలో 2008,2010 మధ్య కాలానికి గ్రామీణ జర్నలిజం విభాగంలో ఉత్తమ జర్నలిస్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అవార్డుతో పాటు రూ.రెండు లక్షల నగదు రివార్డును కూడా అందజేసింది. 2018 వీ6 ఆధ్వర్యంలో వెలువడిన వెలుగు దిన పత్రిక మొదటి నుంచి ఉండి దానికి పునాది వేశారు. నెట్ వర్క్ ఇన్ ఛార్జీగా రాష్ట్రమంతటా బలమైన నెట్ వర్క్ ను ఎంపిక చేసి.. అనతి కాలంలోనే ప్రధాన పత్రికలకు సాటిగా వెలుగును నిలిపారు. జిల్లా పేజీలు.. ప్రత్యేక అనుబంధాలు సక్సెస్ వంటివి సక్సెస్ చేయడంలో నిరంతరం క్రుషి ఉంది. ప్రస్తుతం వెలుగు బ్యూరో చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. గురువారం సీఎం పీఆర్వోగా ఆయనకు ఉత్తర్వులు అందాయి. బొల్గం నియామకం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు.. మేధావులు హర్షిస్తున్నారు. ఆయన సొంత జిల్లా రాజన్న సిరిసిల్లతో పాటు.. గతంలో ఆయన పనిచేసిన జిల్లాల నుంచి జర్నలిస్టులు.. అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.