మాజీ ముఖ్యమంత్రి తన కూతురు ఎమ్మెల్సీ కవితకు ఫోన్ చేసి మాట్లాడారు. ఐదున్నర నెలలుగా జైల్లో సంగతి తెలిసిందే. నిన్ననే బెయిల్ మీద విడుదలైంది. ఢి ల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కవితను ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. కారు ఎక్కగానే ఆమె స్వయంగా తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైనట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ‘బిడ్డా.. ఎట్లున్నవ్? పానం మంచిగున్నదా?’ అన్న తండ్రి మాటలు వినగానే ఆమె కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. కాగా, ఇవాళ సాయంత్రం కవిత హైదరాబాద్ కు చేరుకోనున్నారు.