నిత్యం ప్రజలకు ఉండగా ఉన్న జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు పిలిచింది అని విజయసాయిరెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని జనసేన నేత వేగుళ్ల లీలా కృష్ణ అన్నారు. జగన్ దగ్గర గుమస్తాగా ఉండి లెక్కలు రాసుకుని ఇసుక, మట్టి దందాలు చేసే విజయసాయిరెడ్డి ప్రజాస్వామ్యం గురించి ఏం తెలుసు అంటూ ఘాటుగా స్పందించారు. ఆయన దొంగ లెక్కలు రాయడం వలన జైలుకి వెళ్ళాడు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. తన సొంత పత్రికలో ఇష్టం ఇష్టానుసారంగా రాతలు రాస్తూ.. బ్లూ మీడియా ను పట్టుకుని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్ కి హైదరాబాదులో , ఇక్కడ రెండు ఓట్లు ఉన్నాయి ముందుగా దాని గురించి మాట్లాడండి అంటూ విమర్శించారు. వైసీపీ పార్టీకి అధ్యక్షుడే లేడు.. వేరే వ్యక్తి నుంచి కబ్జా చేసి పార్టీని లాక్కున్నారని అన్నారు.