టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసింది కేవలం మర్యాదపూర్వకంగానేనని ప్రముఖ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. బాబుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో రచించే వ్యూహాల్లో భాగంగానే కలిసినట్లు వార్తలు వచ్చాయి. బాబుకు రిపోర్టు అందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ఇవాళ తాను చంద్రబాబునాయుడిని కలవడం వెనుక ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సీనియర్ రాజకీయనాయకుడు అని, ఆయన కలవాలని కోరడంతో వచ్చానని వెల్లడించారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని వివరించారు.