ఛైన్నై సూపర్ కింగ్స్ ఆంధ్రాకు సంబంధించి ముందుకు వచ్చిందని .. ఆడుదాం ఆంధ్రా క్రీడా సంరంభం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు లోని లయోలా కాలేజీలోని ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రారంభించి స్టూడెంట్స్ కు కిట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికీ వ్యాయామం అవసరమని, ఆడుదాం ఆంధ్రా ద్వారా ప్రతి గ్రామంలోనూ వ్యాయామం లభిస్తుందని తెలిపారు. ఈ క్రీడా కార్యక్రమం సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో దశల వారీగా కొనసాగుతుందని... ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో జరుగుతుందని సీఎం జగన్ వివరించారు. గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీయడమే ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు.