కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడురుపాడు వద్ద నేషనల్ హైవే 16 పై కారు డివైడర్ ను ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి కొవ్వూరు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో థామస్ (40) అక్కడిక్కడే చనిపోగా.. అందులో ప్రయాణిస్తున్న 5 గురికి గాయాలయ్యాయి. పోలీసులు చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.