వైసీపీ ఎమ్మెల్యేలు వీడుతున్నారు. టీడీపీలో చేరేందుకే వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి మొగ్గు చూపుతున్నారు. వైసీపీ నేతలు చేసిన బుజ్జగింపులు ఫలించలేదని వార్తలు వస్తున్నాయి. ఇక వైసీపీలో కొనసాగలేనని పార్టీ నేతలకు సారథి చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే మూడు దఫాలుగా పార్టీ నేతలు సారథితో సమావేశమయ్యారు. సీఎంవోకి వెళ్లి జగన్ ను కలిసిన తర్వాత కూడా సారథి నిర్ణయం మార్చుకోలేదని తెలిసింది. టీడీపీలో చేరికపై ముఖ్య అనుచరులతో పార్థసారథి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పార్థసారథిని టీడీపీ నేతలు వెలగపూడి, బొమ్మసాని సుబ్బారావు కలిసినట్లు సమాచారం అందుతుంది. ఏదిఏమైనా రెండు మూడు రోజుల్లో పార్టీ మార్పుపై స్పష్టత రానుంది.