ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్ 2 నోటీఫికేషన్లకు అప్లై చేసుకునేందుకు వెళ్తే అభ్యర్థులకు సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గంటల తరబడి వేచి చూస్తున్న వెబ్ సైట్ ఓపెన్ కావడం లేదు. అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పెమేంట్ చేసేందుకు ఎంత నమోదు చేసిన ఎర్రర్ అనే మెసేజ్ వస్తుందని అంటున్నారు. దీంతో వివరాల నమోదు మళ్లీ మొదటికే వస్తుందని అంటున్నారు. గడువు ముగియనున్న నేపథ్యంలో టెక్నికల్ సమస్యలు తొలగించాలని కోరుతున్నారు. నెట్ బ్యాంకింగ్ తో పాటు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఫీ చెల్లించే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.