ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:670

GOLCONDA NEWS | Updated:2024-01-10 16:36:01 IST

గోతులు తవ్వి పైకొచ్చిన చరిత్ర నీది.. : మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్

చరిత్ర గురించి నీతులు చెప్పే సునీల్ రావు కాంగ్రెస్ లో గోతులు తవ్వి పైకి వచ్చారని.. తన గత చరిత్రను తవ్వితీస్తే కరీంనగర్ లో తిరగలేవని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్ హెచ్చరించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుగ్గిళ్ళపు రమేష్ మాట్లాడుతూ యాదగిరి సునీల్ రావు సెలెక్టెడ్ అజ్ఞాని అని .. ఎలెక్టెడ్ మేయర్ మాదిరిగా మాట్లాడడం లేదని, నామిని ఎవరో, బినామీ ఎవరో కరీంనగర్ నగర ప్రజలకు బాగా తెలుసని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని, నోటికొచ్చినట్లు మాట్లాడితే తిరిగి అదే స్థాయిలో ప్రతిఘటనలు తప్పవని ఆయన హెచ్చరించారు. సునీల్ రావు ప్యారాచూట్ లీడర్ కాకుంటే తెలంగాణ ఉద్యమంలో అతడి పాత్ర ఏ మేరకు ఉందో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ను తెగ పొగుడుతున్న సునీల్ రావు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరుతారా ఆశ్చర్యం కలుగుతుందన్నారు.
రాజకీయ అవగాహన రాహిత్యంతో పసలేని ఆరోపణలు చేసి చరిత్రలో సునీల్ రావు స్క్రాప్ గా రుజువయ్యాడని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పై పర్సనల్గా విమర్శలు చేసి నవ్వుల పాలయ్యాడని దుయ్యబట్టారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం సుమారు 8వేల కోట్ల అభివృద్ధి పనులను తీసుకొచ్చిన ఘనత ఎంపీ బండి సంజయ్ కుమార్ కే దక్కుతుందన్నారు. సునీల్ రావు వినోద్ కుమార్ కు బినామీ కాకుంటే ఎందుకు అంత ఉలికి పాటుతో ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి పస లేని విమర్శలు చేశారని అన్నారు. సునీల్ రావు కేరాఫ్ కాంగ్రెస్ అని ఎప్పటికీ బిఆర్ఎస్ కాలేడని విమర్శించారు. అందుకే అదే స్థాయిలో కాంగ్రెస్ లో ఎంతో కష్టపడ్డానని చెప్పడం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాడని సంకేతాలు ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రెస్ మీట్ లో ఆనంద్, ప్రవీణ్, లోకేశ్ పాల్గొన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
తెలంగాణ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
Updated:2024-02-16
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
Updated:2024-02-06
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం
Updated:2024-01-29
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
Updated:2024-01-09
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498