ఇన్ని రోజులు అనాథ పిల్లలకు చదువు సంధ్య లేకుండా ఉండేవారు. వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇక నుంచి అలా ఉండదు. అనాథ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో.. ప్రభుత్వ కాలేజీల్లో రెండు శాతం కోటా సీట్లను కేటాయించనున్నారు. ఈ గుడ్ న్యూస్ ను మంత్రి సీతక్క తన ఎక్స్ ఖతాలో వెల్లడించారు. ఇక నుంచి అనాథ పిల్లలు అధైర్య పడవద్దు ..అన్ని ప్రభుత్వ పాఠశాలలు ,కళాశాలలో అనాథ పిల్లలకు రెండు శాతం కోటా సీట్లు కేటాయించాలని అధికారులకు సూచించానని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు ప్రాధమిక పాఠశాల పరిసరాల్లో ఉండేవిధంగా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో అనాథ పిల్లలు ఏం చక్కా బడులకు వెళ్లి పాఠాలు నేర్చుకోవచ్చు.