ఎల్ ఎం డీ దగ్గర్లోని శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీకి చెందిన భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని.. యుత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కరీంనగర్ జిల్లా మహమ్మద్ అమీర్ డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజవాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని.. రెవెన్యూ , సర్వే ల్యాండ్ అధికారులతో సర్వే చేయించి గోడ నిర్మించాలన్నారు. కబ్జా రాయళ్ల మీద ఉక్కు పాదం మోపి పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. గతంలో 3 నెలల కిందటే ఫిల్టర్ బెడ్ కబ్జా చేయడానికి ప్రయత్నించినా .. ఎంక్వైరీ అని చెప్పినా.. నేటి వరకు ఎలాంటి విచారణ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహమాన్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు, మహమ్మద్ ఇమ్రాన్ మాజీ కాంగ్రెస్స్ అసెంబ్లీ అధ్యక్షులు , సిరిపురం నాగరాజు, హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.